షాహిద్ కపూర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కృతిసనన్ నాయిక. లవ్‌స్టోరీ ప్రధానంగా సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ని రివీల్ చేశారు మేకర్స్. బైక్ మీద కూర్చున్న హీరో, హీరోయిన్లు రొమాంటిక్‌గా ఉన్న స్టిల్ అది. నెట్టింట్లో తెగ అప్లాజ్ వస్తోంది ఆ స్టిల్‌కి. ఇంకా ఈ సినిమాకు పేరు పెట్టలేదు. అయితే అక్టోబర్‌లో విడుదల చేస్తామని మాత్రం ప్రకటించారు మేకర్స్. యాన్ ఇంపాజిబుల్ లవ్ స్టోరీ అంటూ ట్యాగ్ లైన్‌తో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన విషయాన్ని చెబుతూ కృతిసనన్ పోస్ట్ పెట్టారు. ''మా ఇంపాజిబుల్ లవ్‌స్టోరీ షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రాజెక్ట్ విడుదల కానుంది. జియో స్టూడియోస్, దినేష్ విజన్ కలిసి నిర్మిస్తున్నాయి. అమిత్ జోషి, ఆరాధనా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే, లక్ష్మణ్ ఉతేకర్ నిర్మాతలు'' అని అన్నారు కృతి.
షాహిద్ పక్కన కృతిసనన్‌ని చూస్తుంటే కెమిస్ట్రీ చాలా హాట్‌గా ఉందంటూ చిలిపి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. నెవర్ సీన్ బిఫోర్ ఫీలింగ్ కలుగుతోందని చెప్పుకొచ్చారు కృతి. సన్‌సెట్ బ్యాక్‌డ్రాప్‌లో బైక్ మీద ఒకరికి ఎదురుగా ఒకరు అలా కూర్చుని ఉంటే చూడటానికి చాలా ముచ్చటేస్తోందని అంటున్నారు నెటిజన్లు. కబీర్ సింగ్2 తీస్తున్నారా ఏంటి? అని ఒకరు ప్రశ్నించగా, హైట్‌ని ఎలా మ్యాచ్ చేశారని ఇంకొకరు ప్రశ్నించారు. ఏ సినిమాకు రీమేక్ ఇది అని మరికొందరు ఆటపట్టిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు గణ్‌పత్‌లోనూ నటిస్తున్నారు కృతి. షాహిద్ చేతిలో అలీ అబ్బాస్ జాఫర్ చిత్రం బ్లడీ డాడీ ఉంది.